News March 13, 2026
ఖమ్మం: ‘గ్రీన్ గోల్డ్’ సాగుతో రైతులకు సుస్థిర ఆర్థికాభివృద్ధి

వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు నాంది పలుకుతూ సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం విజయవంతమైంది. గురుదక్షిణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో NMPBతో పాటు కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ దిశానిర్దేశం చేశారు.
Similar News
News April 10, 2026
‘ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కొనసాగించాలి’

ఏపీలో కలిసిన భద్రాచలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని టీజీఈజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం ఖమ్మం టీఎన్జీవోస్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13న భద్రాచలంలో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ‘అభ్యర్థన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భద్రాద్రి పునరేకీకరణ విస్తృతస్థాయి అఖిలపక్ష సమావేశ పోస్టర్ ను ఆవిష్కరించారు.
News April 10, 2026
చేగోమ్మలో PACS గోదాం ప్రారంభించిన పొంగులేటి

కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నూతనంగా నిర్మించిన PACS గోదాములను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
News April 10, 2026
ఖమ్మంలో రేపు ఫూలే జయంతి వేడుకలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల ఫూలే విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి ఫూలే చేసిన సేవలను స్మరించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.


