News May 5, 2024
గాజువాకలో క్రికెట్ ఆడిన గుడివాడ అమర్నాథ్

గాజువాకలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక జింక్ గ్రౌండ్లో వాకర్స్, క్రీడాకారులను ఆదివారం కలుసుకున్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. ఆయన మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో క్రీడాకారులు అధికంగా ఉన్నారని, వీరిని ప్రోత్సహించేందుకు గాజువాకలోని ఓపెన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు.
Similar News
News October 21, 2025
పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి: మేయర్

అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖను సుందరీకరించండని మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కార్మికుల హాజరును పరిశీలించి, వారి వేతనాలను సకాలంలో చెల్లించాలన్నారు. బీచ్ రోడ్డులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ఎక్కువ మంది కార్మికులను నియమించాలని, గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బీచ్‌లో అదనంగా టాయిలెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
News October 21, 2025
వ్యాపారులు డస్ట్ బిన్‌లు ఉపయోగించాలి: జీవీఎంసీ కమిషనర్

వ్యాపారులు దుకాణాల ముందు డస్ట్ బిన్లు ఉపయోగించాలని, లేనియెడల వారి లైసెన్సులు రద్దు చేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. మంగళవారం ఆరిలోవలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మాంసం, పూల వ్యాపారులు వ్యర్థాలను రోడ్లపై వేయడంతో వారిచేత క్లీన్ చేయించారు. టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడంతో రూ.1000 అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.
News October 21, 2025
సింహాచలం దేవస్థానం ఇన్‌ఛార్జ్ ఈవోగా సుజాత

సింహాచలం దేవస్థానం ఇన్‌ఛార్జ్ ఈవోగా ప్రస్తుతం జోనల్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సుజాతకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ ఈవోగా వ్యవహరిస్తున్న త్రినాథరావు రిలీవ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది.