News March 13, 2026
సిద్దిపేట: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

28న సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, మోటార్ వాహనాల కేసులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్, కంపౌండ్డబుల్, సివిల్, చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కంటే లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు.
Similar News
News April 13, 2026
ప.గో : ఈ మున్సిపాలిటీలకు ఈసారైనా ఎన్నికలు జరిగేనా ?

పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు మున్సిపాలిటీలకు సమీప గ్రామాల విలీనంపై కోర్టు కేసులు ఉండటంతో దాదాపు పదేళ్లుగా ఎన్నికలకు నోచుకోలేదు. ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతోంది. ముగియగానే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. 4 మున్సిపాలిటీలకు కోర్టు కేసులు పరిష్కారం తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News April 13, 2026
తిరుపతి జిల్లాలో ఇచ్చిందే తీసుకోవాలంట..!

తిరుపతి జిల్లాలో గ్యాస్ బుకింగ్‌కు కాల్ చేస్తే వెంటనే కట్ అయిపోతోంది. ఆటోమేటిక్‌గా వారం లేదా 10 రోజులకు OTP వస్తోంది. కొన్ని సంస్థలు సిలిండర్ డెలివరీకి 20 రోజులు తీసుకుంటున్నాయి. 5కేజీ, 10కేజీ, 14 కేజీల సిలిండర్లు ఉంటాయి. ప్రజలు కోరింది కాకుండా ఆటోమేటిక్ సిస్టం ద్వారా ఏది వస్తే అది తీసుకోవాల్సి వస్తోంది. వచ్చిన గ్యాస్ తిరిగి వెళ్లిపోవడం, ఖాళీ సిలిండర్లు లేకపోవడం సరఫరా చేయడానికి ఆలస్యమవుతోంది.
News April 13, 2026
పాత ఇంట్లో దొరికిన నాణెం.. వేలంలో ₹1.2కోట్లు

బ్రిటన్ చరిత్రలోనే అత్యంత అందమైన నాణెంగా పేరుగాంచిన ‘యూనా అండ్ ది లయన్’ గోల్డ్ కాయిన్ వేలంలో £110,000 (సుమారు ₹1.2 కోట్లు) పలికింది. వేల్స్‌లోని ఒక పాత ఇంట్లో దొరికిన ఈ ఐదు పౌండ్ల నాణేన్ని 1839లో క్వీన్ విక్టోరియా పట్టాభిషేక జ్ఞాపకార్థం ముద్రించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 300 మాత్రమే ఉండటంతో కాయిన్ కలెక్టర్స్ దీనిని నాణేల ప్రపంచంలో ‘హోలీ గ్రెయిల్’(అత్యంత అరుదైనది)గా భావిస్తారు.


