News March 13, 2026
గద్వాల: గ్యాస్ సిలిండర్ల కొరత లేదు – కలెక్టర్

జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. సిలిండర్ల కోసం వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరఫరా నిరంతరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 11, 2026
25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు ప్రకటన

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల పరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే చివరి వరకు దేశంలోని వివిధ సెంటర్లలో <
Share It
News April 11, 2026
జగిత్యాల: జ్యోతిబా ఫూలేకు బీఆర్‌ఎస్ నాయకుల ఘననివాళి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహా పలువురు నేతలు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఫూలే సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.
News April 11, 2026
రేపటి వరకు వర్షాలు!

ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సముద్ర మట్టానికి 0.9కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఆస్కారముందని వివరించింది.


