News March 13, 2026
ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో గృహ అవసరాలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎల్పీజీ గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ’ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిలిండర్ల సరఫరాలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 11, 2026
ADB: కారుణ్య నియామకాల్లో 16 మందికి ఉత్తర్వులు

జిల్లాలో కారుణ్య నియామకాల కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపికైన 16 మంది అభ్యర్థులకు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులను అందజేశారు. 10 రెవెన్యూ , 2 సేల్స్ టాక్స్, 1 వెల్ఫేర్, 1 వైద్య శాఖ, 1 అకౌంట్స్, 1 ఇరిగేషన్ శాఖలకు కేటాయించారు.మొత్తం 15 జూనియర్ అసిస్టెంట్, ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పత్రాలిచ్చారు.
News April 11, 2026
ADB: ఏజెన్సీలో టెనెన్సీ భూముల భారీ స్కామ్..!

ASF, ADB ఏజెన్సీలో టెనెన్సీ భూములపై భారీ స్కామ్ వెలుగుచూసింది. 1954కు ముందు నిజాం కాలంలో భూములు గ్రామ అధికారుల పేర్లపై ఉండేవి. వారు ఆ భూములను రైతులకిచ్చి కౌలు వసూలు చేసేవారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత అప్పటి ప్రభుత్వం రక్షిత కౌలు చట్టం ద్వారా ఆ భూములపై కౌలు రైతులకు హక్కులు కల్పించింది. ప్రస్తుతం అప్పటి గ్రామ అధికారుల వారసులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై దాదాపు 50వేల ఎకరాల్లో స్కామ్‌కు తెరలేపారు.
News April 11, 2026
అల్లూరి: వాగులో మునిగి యువకుడు మృతి

అల్లూరి జిల్లా చింతూరు మండలం సోకులేరు వాగులో మునిగి ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన కాంతటి రమేష్ శనివారం మృతి చెందాడు. సోకులేరు వ్యూ పాయింట్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. విహార యాత్రకు వచ్చిన ఇతను వాగులో దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినట్లు చింతూరు సీఐ సీహెచ్ గోపాలకృష్ణ తెలిపారు.


