News March 14, 2026

సిరిసిల్ల: ‘రాష్ట్రంలో ప్రజలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి’

image

రాష్ట్రంలో ప్రజలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్లు, నీటి పారుదల ప్రాజెక్టులలో నీటి నిలువ, యాసంగి పంటల కొనుగోలకు ఏర్పాట్లపై శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరయ్యారు.

Similar News

News March 31, 2026

KNR: గ్రానైట్ విచారణలో వేగం.. రంగంలోకి సీబీ-సీఐడీ..!

image

నాలుగేళ్ల కిందట గ్రానైట్ అక్రమాలపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంటితో పాటు పలు గ్రానైట్ క్వారీల యజమానుల ఇళ్లలో ED సోదాలు నిర్వహించింది. పనమా వికీ లీక్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరగగా, చైనా కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీల్లో హవాలా జరిగిందని ED ప్రకటించింది. కాగా దీనిపై తర్వాత ఎలాంటి విచారణ జరగలేదు. ఇప్పుడు CM రేవంత్ సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించడంతో ED సైతం రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News March 31, 2026

గడ్డిమందుపై నిషేధాస్త్రం.. ADBలో చర్చ

image

నిషేధిత గడ్డిమందు వినియోగాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం సంచలనంగా మారింది. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో అధికారులు 142 కేసులు నమోదు చేసి, సుమారు రెండు కోట్ల విలువైన నిల్వలను సీజ్ చేశారు. ఈ రసాయన ప్రభావంతో సుమారు 45,000 ఎకరాల్లో భూసారం దెబ్బతిని పంట ఎదుగుదల ఆగింది. 15 శాతం మేర దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజా నిషేధంతోనైనా అన్నదాతలకు ఈ రసాయన ముప్పు తప్పుతుందని ఆశిస్తున్నారు.

News March 31, 2026

ఇన్‌స్టాగ్రాం ప్రేమ.. చిత్తూరు అమ్మాయి మిస్సింగ్

image

ఇన్‌స్టాగ్రాం పరిచయం ప్రేమగా మారిన ఘటన ఇది. చిత్తూరు వన్ టౌన్ పరిధిలోని బాలిక(17)కు పాకాల మండలం దామల చెరువుకు చెందిన ప్రవీణ్ ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. ఈనెల 23న బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ వద్ద బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికను వెంట తీసుకెళ్లడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.