News May 5, 2024
పత్రికా స్వేచ్ఛలో భారత్ ర్యాంక్ 159
180 దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్టు విడుదల చేసింది. టాప్-10లో నార్వే, డెన్మార్క్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్, ఎస్టోనియా, పోర్చుగల్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ ఉన్నాయి. చివరి 10 స్థానాల్లో సిరియా, అఫ్గాన్, నార్త్ కొరియా, ఇరాన్, తుర్క్‌మెనిస్థాన్, వియత్నాం, బహ్రెయిన్, చైనా, మయన్మార్ ఉన్నాయి. గత ఏడాది భారత్ 161వ ర్యాంక్‌లో ఉండగా, ఈసారి 159కి చేరింది.
Similar News
News December 27, 2024
నన్ను అల్లు అర్జున్‌తో పోల్చవద్దు: అమితాబ్
‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. తాజాగా KBCలో తాను అల్లు అర్జున్, అమితాబ్ ఫ్యాన్ అని ఓ కంటెస్టెంట్ చెప్పారు. దీనికి అల్లు అర్జున్ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడని, ఈ గుర్తింపునకు అతను అర్హుడని పేర్కొన్నారు. తాను కూడా పుష్ప-2తో AAకు అభిమానిని అయ్యానని చెప్పారు. ఆయనతో తనను పోల్చవద్దని బిగ్ బీ పేర్కొన్నారు.
News December 27, 2024
GREAT: 90 ఏళ్ల వయసులో వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేశారు!
గతేడాది కేంద్రం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పొడిగించేందుకు ‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లు’ను రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పాసైతే ఢిల్లీ అధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని, అడ్డుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థించారు. 90 ఏళ్ల వయసు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటు వేశారు. మన్మోహన్ అంకితభావాన్ని ప్రధాని మోదీ సైతం కొనియాడారు.
News December 27, 2024
షాకింగ్: మీ సేవ పేరుతో నకిలీ వెబ్‌సైట్
TG: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ విజృంభిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సైట్ meeseva.telangana.gov.in కాగా meesevatelangana.in పేరుతో నకిలీది సృష్టించారు. కొత్తగా మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ HYD కలెక్టర్ పేరుతో ఫేక్ ఉత్తర్వులు రూపొందించారు. అది చూసి చాలా మంది ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు. ఈ స్కామ్‌పై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. నకిలీ సైట్‌ను బ్లాక్ చేసింది.