News March 14, 2026

రారండోయ్..

image

నేడు, రేపు చారిత్రక <<19377870>>గుత్తి కోట<<>> ఉత్సవాలు
★ శనివారం సా.5:30కు కార్యక్రమం మొదలు
★ 5:45 గంటలకు జిల్లా కలెక్టర్ ఆనంద్ స్వాగత ప్రసంగం
★ 6:32 గంటలకు లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారి శివతాండవం
★ 6:45 గంటలకు గుత్తి కోట చరిత్రపై గజల్ ప్రోగ్రాం
★ 7:16 గంటలకు సక్కనైన వాడు.. ఫోక్ డాన్స్
★ 7:36 గంటలకు ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఫ్యూజన్
★ 8:21 గంటలకు ప్లేట్ సాంగ్
★ 8:30 గంటలకు కృష్ణవేణి టీం వారి రేలా రే రేలా

Similar News

News April 1, 2026

తూ.గో: కొండపై పులి.. పౌర్ణమి పూజలకు వెళ్లొద్దు

image

దేవీపట్నం మండలం పూడిపల్లి వద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు బుధవారం గుర్తించారు. నేలకోట రామదుర్గం కొండపై పౌర్ణమి పూజలకు వచ్చే భక్తులు రాత్రి సమయాల్లో అక్కడ ఉండటం ప్రమాదకరమని హెచ్చరించారు. పోశమ్మ గండిని దర్శించుకునే వారు సాయంత్రానికే తిరిగి వెళ్లాలని సూచించారు. కొండల సమీప గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవి వైపు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

News April 1, 2026

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత విస్మరిస్తే చర్యలు: మంత్రి అడ్లూరి

image

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం జగిత్యాల కలెక్టరేట్‌లో ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల సంరక్షణ-పర్యవేక్షణ చట్టం-2026’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టపడి పెంచిన పిల్లలు బాధ్యత మరచిపోవడంతో వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు.

News April 1, 2026

అన్నమయ్య జిల్లాకు ప్రెస్ స్టిక్కర్లు విడుదల చేసిన SP

image

అన్నమయ్య జిల్లాకు క్యూఆర్ కోడ్ “ప్రెస్” స్టిక్కర్లను బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నకిలీ విలేకరులకు అడ్డుకట్టవేయాలని జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలోని నిజమైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థనతో ప్రెస్ స్టిక్కర్లను తయారు చేసి, అక్రిడేషన్ జర్నలిస్టులకు పంపిణీ చేశామన్నారు.