News May 5, 2024

విశాఖ: ఇక్కడ నోటాకు అత్యధిక ఓట్లు.. దేశంలోనే 2nd

image

అరకు లోక్‌సభ 2019 ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019లో బీహార్‌లోని గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 ఓట్లు ‘నోటా’కి రాగా, ఆ తర్వాతి స్థానంలో అరకులో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందనే లెక్కలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘జనరల్ ఎలక్షన్స్ 2019: యాన్ అట్లాస్’లో పేర్కొంది.

Similar News

News July 10, 2025

మత్యకారులకు రాయితీపై బోట్లు, ఇంజిన్‌ల సరఫరా

image

‘జాతీయ ఫిష్ ఫార్మర్స్ డే’ని పురష్కరించుకొని గురువారం పెదజాలరిపేటలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్యకారులకు 55 ఇంజిన్లు సరఫరా చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు చేతుల మీదుగా వాటిని అందించారు. రూ.45.81 లక్షలు విలువ కలిగిన ఇంజిన్లకు ప్రభుత్వం రూ.18.32 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. నియోజకవర్గంలో బోట్లు, ఇంజిన్లు, వలలు కావలసిన జాలరులకు 40% రాయితీపై సరఫరా చేస్తామన్నారు.

News July 10, 2025

పిల్ల‌ల ల‌క్ష్య సాధ‌న‌లో త‌ల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవ‌స‌రం: కలెక్టర్

image

పిల్లల ల‌క్ష్య సాధ‌న‌లో త‌ల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవ‌స‌ర‌మ‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. మెగా పేరెంట్స్&టీచ‌ర్స్ మీటింగుల్లో భాగంగా చిన‌గ‌ద‌లి జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్లో గురువారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి పాల్గొన్నారు. చిన్నారుల‌కు వారి తల్లిదండ్రులు రోజూ ప్ర‌త్యేక స‌మ‌యం కేటాయించాల‌ని, పాఠ‌శాల నుంచి వ‌చ్చాక ఉత్తేజ‌ప‌రచాల‌ని సూచించారు.

News July 10, 2025

విశాఖ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కంచరపాలెం సమీపంలోని NCC రైల్వే యార్డ్ వద్ద జరిగింది. స్థానికుల సమాచారంతో GRP ఎస్‌ఐ అబ్దుల్ మారూఫ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయసు సమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. అతని ఐడెంటిటికీ సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని, మృతదేహాన్ని KGHకి తరలించామన్నారు. పై ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పేర్కొన్నారు.