News March 14, 2026
‘సంభల్’లో నమాజ్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

<<15204583>>వివాదాస్పద సంభల్<<>>లోని మసీదులో నమాజ్ చేసే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయాలన్న UP అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. శాంతిభద్రతలను పరిరక్షించలేకపోతే SP, కలెక్టర్ బదిలీ చేయించుకోవాలని, లేదంటే రిజైన్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి కమ్యూనిటీకి కేటాయించిన స్థలంలో శాంతియుతంగా ప్రార్థనలు చేసుకునేలా చేయడం ప్రభుత్వ విధి అని తెలిపింది.
Similar News
News April 8, 2026
ఒకప్పుడు 50 దాటాక.. ఇప్పుడు 30లోపే షుగర్

‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026’ రిపోర్ట్ ప్రకారం భారత్‌లో 30 ఏళ్ల లోపున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రీ-డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారు. సగం కంటే ఎక్కువ మంది ఒబెసిటీ, కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే వీటిని గుర్తిస్తే 28% మంది మళ్లీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ 50 ఏళ్లు దాటాక ఆ అవకాశం కేవలం 7% మాత్రమే ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News April 8, 2026
మొబైల్ యూజర్లకు కాల్స్+SMS ప్లాన్స్.. ట్రాయ్ ప్రతిపాదన!

డేటా అవసరం లేని వారి కోసం కేవలం కాల్స్, SMSలు మాత్రమే ఉండే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకురావాలని ట్రాయ్ ప్రతిపాదించింది. ప్రస్తుతం డేటా ప్లాన్‌లు ఏయే వ్యాలిడిటీతో ఉన్నాయో, వాయిస్+మెసేజ్ ప్లాన్‌లనూ అదే వ్యాలిడిటీతో తేవాలని టెలికం కంపెనీలకు సూచించింది. ఈ మేరకు డ్రాఫ్ట్ టెలికం కన్జూమర్ ప్రొటెక్షన్ (13వ సవరణ) రెగ్యులేషన్-2026ను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై APR28 వరకు <
News April 8, 2026
సీజ్‌ఫైర్.. భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు!

కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించడంతో అంతర్జాతీయ చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 15 శాతం పడిపోయి 92.67 డాలర్లకు దిగివచ్చింది. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఏకంగా 20 డాలర్లు తగ్గి 94.87కు పడిపోయింది. మరోవైపు వరుస నష్టాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభపడే అవకాశం ఉంది.


