News May 5, 2024
VZM: ఇక్కడ నోటాకు అత్యధిక ఓట్లు.. దేశంలోనే 2nd

అరకు లోక్‌సభ 2019 ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019లో బిహార్‌లోని గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 ఓట్లు ‘నోటా’కి రాగా, ఆ తర్వాతి స్థానంలో అరకులో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందనే లెక్కలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘జనరల్ ఎలక్షన్స్ 2019: యాన్ అట్లాస్’లో పేర్కొంది.
Similar News
News September 27, 2025
VZM: రేపటి నుంచి అఖిలభారత డ్వాక్రా బజార్

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్వయం సహాయక సంఘాలు రూపొందించే ఉత్పత్తుల ప్రదర్శనకు అఖిల భారత డ్వాక్రా బజార్ గొప్ప వేదికగా నిలవనుందని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. తన ఛాంబర్‌లో మీడియాతో శనివారం మాట్లాడారు. ఆదివారం నుంచి మనందరికీ అందుబాటులో విజయనగరంలో ప్రారంభంకానున్న ఈ ప్రదర్శనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
News September 27, 2025
VZM: ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం..!

జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో 17, బొబ్బిలిలో 27, చీపురుపల్లిలో 4, గజపతినగరంలో 3, నెల్లిమర్లలో 4, విజయనగరంలో 61, ఎస్.కోట నియోజకవర్గంలో 10 మొత్తం 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, తరలింపులు, కొత్త కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని DRO శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు.
News September 27, 2025
పొక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష: SP

పొక్సో కేసులో జమ్ము నారాయణపట్నానికి చెందిన అప్పారావుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానాను కోర్టు విధించిందని SP దామోదర్ శుక్రవారం తెలిపారు. 7 ఏళ్ల బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడనే తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారన్నారు. నేరం రుజువు కావడంతో 10 నెలల్లోనే శిక్ష ఖరారైందన్నారు. బాధితురాలికి రూ.3లక్షల పరిహారం మంజూరైందన్నారు.