News March 14, 2026

పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేస్తున్నారా?

image

యుద్ధం కారణంగా ఇంధనం కొరత రావొచ్చనే భయంతో చాలా మంది పెట్రోల్, డీజిల్‌ను విడిగా తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం ప్రకటించింది. నిల్వల వల్ల అగ్ని ప్రమాదాలు జరగొచ్చని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపుకోవాలని సూచించింది.

Similar News

News March 30, 2026

విశాఖ సీపీ కార్యాలయానికి 125 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమిషనరేట్‌కు సోమవారం 125 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News March 30, 2026

BREAKING: వైభవ్ విధ్వంసం

image

చెన్నైతో మ్యాచ్‌లో RR యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 17 బంతుల్లో 52 రన్స్ చేసి ఔటయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన CSK 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

News March 30, 2026

భారత భవిష్యత్తును మోదీ తాకట్టుపెట్టారు: రాహుల్

image

PM మోదీ తనను, తన వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారని LoP రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన భారత భవిష్యత్తును తాకట్టు పెట్టారనే విషయం ప్రజలకు తెలుసన్నారు. ‘మోదీ పాలనలో డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం రూ.100 దిశగా సాగుతోంది. స్టాక్స్, ఎకానమీ, ఇన్‌కమ్, సేవింగ్స్ పడిపోయాయి. ఉద్యోగాలు మాయమయ్యాయి. సిలిండర్లు అందుబాటులో లేవు. వీటన్నిటికీ మోదీ రాజీపడటమే కారణం’ అని ట్వీట్ చేశారు.