News March 14, 2026
సిరిసిల్ల: 8 మంది విద్యార్థులు గైర్హాజరు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో SSC పబ్లిక్ పరీక్షలు మొదటిరోజున ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 34 పరీక్షా కేంద్రాలలో 7307 మంది విద్యార్థులకు గాను 7299 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కన్నారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News March 28, 2026
నిజామాబాద్: సైబర్ వల.. చిక్కితే విలవిల

ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవలం ఆరు నెలల్లోనే జిల్లా వ్యాప్తంగా బాధితులు సుమారు రూ. 4 కోట్లకు పైగా సొమ్మును పోగొట్టుకున్నారు. గతంతో పోలిస్తే ఈ జిల్లాలో నేరాల సంఖ్య 30 శాతం పెరగడం గమనార్హం. ముఖ్యంగా ఆర్మూర్, బోధన్, కామారెడ్డి ప్రాంతాల్లో గల్ఫ్ బాధితులే లక్ష్యంగా ఫేక్ లాటరీ కాల్స్, పార్శిల్ స్కామ్స్ ద్వారా డబ్బులు కొల్లగొడుతున్నారు. విద్యావంతులు బాధితులు అవడం ఆందోళనకరం.
News March 28, 2026
KNR: రెండు లారీల మధ్య నలిగిన కారు

WGL-KNR రహదారిపై కేశవపట్నం వద్ద శనివారం ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న కారు దాన్ని ఢీకొట్టింది. అదే సమయంలో కారు వెనుక ఉన్న మరో లారీ వేగంగా వచ్చి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 లారీల మధ్య ఇరుక్కుపోయిన కారు ముందు, వెనుక భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కారును ఢీకొట్టిన లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదుచేశారు.
News March 28, 2026
వారిని అన్‌ఫాలో చేసిన రిషబ్.. శాండల్‌వుడ్‌లో కలకలం

‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి వ్యవహారం శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశమవుతోంది. డైరెక్టర్, నటుడు రాజ్ బీ శెట్టి, హీరోయిన్ రుక్మిణీ వసంత్, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ను ఆయన ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం కలకలం రేపింది. వారితో విభేదాలతోనే ఇలా చేశారని టాక్ నడుస్తోంది. దీనిపై ఎవరూ స్పందించలేదు. రాజ్‌తో కల్ట్ క్లాసిక్ ‘గరుడ గమన వృషభ వాహన’, రుక్మిణీతో కాంతార: చాప్టర్1 చిత్రాల్లో రిషబ్ నటించారు.


