News March 14, 2026
మెట్‌పల్లి: క్వింటాల్ పసుపు @13,524

మెట్‌పల్లి మార్కెట్‌లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ.13,524, కనిష్ఠం రూ. 9,009; పసుపు గోళ గరిష్ఠం రూ.12,222, కనిష్ఠం రూ. 8,808; పసుపు చూర గరిష్ఠం రూ.10,523, కనిష్ఠం రూ.8,686గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ రోజు మార్కెట్‌లో మొత్తం 1,024 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయన్నారు.
Similar News
News April 15, 2026
నేడు నిజామాబాద్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం మంత్రి నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2:45 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు తిరుగు పయనవుతారు.
News April 15, 2026
ప్రకాశం: ప్రభుత్వ కాలేజీ విద్యార్థికి జిల్లా ఫస్ట్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో S.కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ MPC విభాగంలో కత్తి కిరణ్ 975/1000 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ MPC-389, BiPC-411, CEC-459, HEC-441, 2nd ఇయర్‌లో BiPC-898, CEC-891, HEC-669 టాప్ మార్క్స్ సాధించినట్లు చెప్పారు.
News April 15, 2026
రూ.5108 కోట్లతో పోలవరం R&R పనులు: CBN

AP: పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, నల్లమల సాగర్ లింక్, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రూ.5108 కోట్లతో పోలవరం సివిల్, R&R పనులు చేపట్టాలని ఆదేశించారు. 38060 నిర్వాసిత కుటుంబాల్లో 16763 ఫ్యామిలీలను తరలించారని, మిగతా వారిని 2027 APRకల్లా తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు రూ.27,089 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.


