News May 5, 2024

రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పరిధిలో మే 6 నుంచి 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ప్రక్రియ జరుగనుందని, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా సంబంధిత ప్రక్రియలను నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జీ.సృజన అధికారులను ఆదేశించారు. ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News July 10, 2025

విద్య భవిష్యత్తును నిర్ణయిస్తుంది: మంత్రి భరత్

image

విద్య భవిష్యత్తును నిర్ణయిస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం కర్నూలులోని టౌన్ మోడల్ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంత్రి లోకేశ్ విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

News July 10, 2025

డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే లక్ష్యం: ఈగల్ ఐజీ

image

డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే మన ముందున్న లక్ష్యమని ఈగల్ ఐజీ రవికృష్ణ అన్నారు. గురువారం కప్పట్రాళ్లలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. రవికృష్ణ మాట్లాడుతూ.. పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. అనంతరం గతేడాది 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు.

News July 10, 2025

కబడ్డీ ఆడిన కర్నూలు DEO శామ్యూల్ పాల్

image

వెల్దుర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో తల్లిదండ్రులకు ఆటల పోటీలను ఉపాధ్యాయులు నిర్వహించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ విద్యార్థుల తండ్రులతో కలిసి కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు.