News March 14, 2026
జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో ప్రజల ఆందోళనలు తొలగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్‌తో కలిసి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు, పలు రెవెన్యూ అంశాలపై తహశీల్దార్లతో జూమ్ కాల్ ద్వారా సమావేశం నిర్వహించారు.
Similar News
News April 15, 2026
పీజీఆర్ఎస్ అర్జీలకు వేగవంత పరిష్కారం: కలెక్టర్

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఏ.సిరి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు లాగిన్‌లో అర్జీలను పరిశీలించి, వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించి సానుకూల స్పందన శాతాన్ని పెంచాలని తెలిపారు. జిల్లాలో 104 శాతం ఆదాయం సాధించడంపై ప్రశంసించారు.
News April 15, 2026
ADB: ఇంటర్ ఫలితాల హోరు.. అడ్మిషన్ల జోరు!

ఇంటర్ ఫలితాలు వెలువడిన రెండు రోజుల్లోనే ఉమ్మడి జిల్లాలో విద్యా వ్యాపారం ఊపందుకుంది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఫొటోలతో ప్రకటనల హోరు మొదలైంది. టాపర్లకు ఉచిత సీట్లు, ఫీజు రాయితీలంటూ ఇంజినీరింగ్ కళాశాలలు ఎరవేస్తున్నాయి. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ‘మా ర్యాంకులు ఇవి’ అంటూ ప్రచార యుద్ధానికి దిగాయి. మరోవైపు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు ఇళ్లకు వెళ్తూ అడ్మిషన్లకు ప్రయత్నిస్తున్నారు.
News April 15, 2026
ఇంటర్నేషనల్ రేంజ్‌లో మన IIT HYD

IITH అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు సాధించింది. ఇంగ్లిష్ లిటరేచర్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, బయోలాజికల్ సైన్స్ వంటి సబ్జెక్టుల్లో అద్భుత ర్యాంకులు సాధించింది. వివిధ విభాగాల్లో 150- 600 మధ్య వరల్డ్ ర్యాంకులు పొందడం సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఉన్నత విద్య, పరిశోధనలో IITH స్థానం బలపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.


