News March 14, 2026
మంచిర్యాల: జిల్లాలో గ్యాస్ కొరత లేదు

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్పిజీ సిలిండర్లు సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల కొరతలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించారు.
Similar News
News April 8, 2026
భద్రాద్రి: నేడు కేంద్ర పథకాల అమలుపై సమీక్ష

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కో-ఛైర్మన్‌గా పాల్గొంటారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై పురోగతిని వివరించాలని కలెక్టర్ అంకిత్ కోరారు. పథకాల లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని ఆయన సూచించారు.
News April 8, 2026
సీజ్‌ఫైర్.. భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు!

కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించడంతో అంతర్జాతీయ చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 15 శాతం పడిపోయి 92.67 డాలర్లకు దిగివచ్చింది. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఏకంగా 20 డాలర్లు తగ్గి 94.87కు పడిపోయింది. మరోవైపు వరుస నష్టాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభపడే అవకాశం ఉంది.
News April 8, 2026
జిల్లాలో సెగలు: ఐదు రోజుల పాటు వేడిగాలులు

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రానున్న ఐదు రోజులు వేడిగాలులు వీస్తాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని చెప్పారు. గాలిలో తేమ శాతం సైతం తగ్గే సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.


