News March 15, 2026
నావిక్‌కు అంతరాయం

GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ అభివృద్ధి చేసిన NavIC(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్)కు ఇబ్బంది ఎదురైంది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన 4 శాటిలైట్ల(IRNSS)లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందులోని 3 అటామిక్ క్లాక్‌లలో ఇప్పటికే 2 చెడిపోగా, చివరిదీ ఫెయిలవడంతో నావిగేషన్, పొజిషనింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. 10ఏళ్ల కాలపరిమితితో ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది.
Similar News
News March 27, 2026
లిల్లీ పంటలో దుంపకుళ్లు తెగులు – నివారణ

లిల్లీ పంటలో దుంపకుళ్లు తెగులు అధిక తేమ మరియు శిలీంధ్రాల వల్ల వస్తుంది. ఇది పంట దిగుబడిని భారీగా దెబ్బతీస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారతాయి. తెగులు తీవ్రమైతే మొక్క మొత్తం వడిలిపోయి, ఎండిపోతుంది. భూమిలో ఉన్న దుంపలు మెత్తబడి, కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News March 27, 2026
పారాక్వాట్‌ను బ్యాన్ చేయండి.. PM, CMకు నటుడి విజ్ఞప్తి

TG: కలుపు నివారణకు వాడే పారాక్వాట్(గడ్డి మందు)ను బ్యాన్ చేయాలని నటుడు రాహుల్ రామకృష్ణ ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. దాన్ని తాగి తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మందు సులభంగా దొరకడం వల్ల దుర్వినియోగం జరుగుతోందన్నారు. కాగా ఈ మందు విక్రయాలపై ప్రభుత్వం ఇప్పటికే <<19342790>>నియంత్రణ చర్యలు<<>> చేపట్టింది.
News March 27, 2026
ఏప్రిల్ 21లోగా ఇంటర్ ఫలితాలు!

AP: ఇంటర్ ఎగ్జామ్స్ వాల్యుయేషన్‌ను ఏప్రిల్ 10-14 మధ్య పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 21లోపు ఫలితాలను వెల్లడించనున్నట్లు సమాచారం. మే తొలి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు దాదాపు 10.37 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.


