News March 15, 2026

జగిత్యాల: సైబర్ మోసగాళ్ల వలలో పోలీసు అధికారి.!

image

సైబర్ మోసగాళ్లు పోలీసు అధికారినే లక్ష్యంగా చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ASIకి గుర్తుతెలియని వ్యక్తులు వీడియో కాల్ చేసి అతని వీడియోను రికార్డు చేశారు. అనంతరం దానిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో భయపడిన ASI మూడు విడతల్లో రూ.95,500 వారి ఖాతాకు పంపించాడు.

Similar News

News April 19, 2026

రేపు యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్‌: కాకినాడ కలెక్టర్

image

కాకినాడ జిల్లాలో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లు యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి అధికారులందరూ హాజరై అర్జీలు స్వీకరిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News April 19, 2026

నగరడోన@45.4 డిగ్రీలు.. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

ఇవాళ APలో ఎండలు బెంబేలెత్తించాయి. కర్నూలు(D) నగరడోనలో 45.4, కడప(D) ఖాజీపేటలో 44.5 డిగ్రీలు, చాలా చోట్ల 40 డిగ్రీల పై ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.

News April 19, 2026

అన్న క్యాంటిన్లకు భువనేశ్వరి రూ.76 లక్షల విరాళం

image

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం (ఏప్రిల్ 20) పురస్కరించుకుని ఆయన సతీమణి భువనేశ్వరి ఉదారత చాటుకున్నారు. అన్న క్యాంటిన్లకు రూ.76 లక్షల విరాళం ప్రకటించారు. ఈ నిధులతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటిన్లలో పేదలకు ఉచితంగా భోజనం వడ్డించనున్నారు. పేదల ఆకలి తీర్చడంలో ఈ క్యాంటిన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటికి అండగా నిలవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.