News March 15, 2026

గజ్వేల్: RMP డాక్టర్ సూసైడ్

image

గజ్వేల్ మం. గిరిపల్లికి చెందిన RMP డాక్టర్ నెమటూరి చిన్నమల్లయ్య (41) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు చేసి తీర్చే మార్గం లేక, గత 6 నెలలుగా గజ్వేల్‌లోని అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు పగులగొట్టి చూడగా చిన్నమల్లయ్య ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 10, 2026

సూర్యాపేట: పంట మార్పిడిలో జిల్లా వెనుకంజ

image

జిల్లాలో పంటల వైవిధ్యం లోపించడంపై వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని 6.24 లక్షల ఎకరాల సాగు భూమిలో 92.5% కేవలం వరి, పత్తి పంటలే సాగవుతుండటంతో రాష్ట్రంలోనే జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఒకే రకమైన పంటల వల్ల భూసారం తగ్గి, పెట్టుబడి పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతులు పంట మార్పిడి చేపట్టి, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచిస్తున్నారు.

News April 10, 2026

ఆర్టీసీలో ట్రైనీ ఫలితాలు విడుదల

image

TGSRTCలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(MST) పోస్టుల ఫలితాలను TSLPRB రిలీజ్ చేసింది. TST పోస్టులకు 9,377 మంది, MST జాబ్స్‌కు 2,755మంది అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు HYD అంబర్‌పేట్ PTCలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించింది. 198 పోస్టుల భర్తీకి మార్చి 29న పరీక్షలు జరిగాయి.

News April 10, 2026

నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవాలకు ఎమ్మెల్యే బత్తుల

image

రాజానగరంలో శ్రీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 16, 17వ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ గవర్నర్‌కు దుశ్శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.