News March 15, 2026

డ్రగ్స్ వివాదంలో ‘పైలట్ రోహిత్’!

image

డ్రగ్స్ వినియోగిస్తారనే ఆరోపణలు పైలట్ రోహిత్ రెడ్డిపై వస్తూనే ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ కేసులో బెంగళూర్ పోలీసులు విచారణకు పిలిచారు. ఇప్పుడు తన ఫాంహౌస్‌లోనే డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇదే ఫాంహౌస్ వేదికగా జరిగింది. ఇప్పుడు డ్రగ్స్ పార్టీకి కూడా ఇదే వేదిక. దీంతో పైలట్‌తో పాటు ఆయన ‘ఫౌంహౌస్‌’ కూడా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Similar News

News March 29, 2026

భద్రాద్రిలో గోదావరికి భక్తి నీరాజనం..!

image

భద్రాద్రి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తిపారవశ్యంలో మునిగితేలింది. పాల్గుణ ఏకాదశి పురస్కరించుకుని గోదావరి నదికి పురోహితులు కనులవిందుగా హారతి ఇచ్చారు. రవికుమార్ నేతృత్వంలో సాగిన ఈ వేడుకలో అష్టోత్తర శతనామార్చన,గణపతి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు దీపోత్సవం వెలిగించి, గోదావరి మాత ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.

News March 29, 2026

గర్ల్‌ఫ్రెండ్‌కు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్

image

క్రికెటర్ హార్దిక్ పాండ్య తన ప్రేయసి మహీకా శర్మకు ఖరీదైన కారును గిఫ్టుగా ఇచ్చారు. రూ.1.7కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ వీ-క్లాస్‌ను ప్రజెంట్ చేశారు. కారు వద్ద వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో SMలో వైరల్ అవుతోంది. భార్య నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ మహీకతో రిలేషన్‌లో ఉన్నారు. కాగా ఇటీవల మాజీ భార్య నటాషా, కుమారుడు అగస్త్యకు రూ.4CR విలువైన ల్యాండ్‌రోవర్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే.

News March 29, 2026

నాగావళి తీరంలో చెట్టుకు వేలాడుతున్న అస్థిపంజరం

image

ఆమదాలవలస (M) తోటాడ గ్రామం పరిధి నాగావళి నది తీరంలో మృతకళేబరం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఆదివారం సాయంత్రం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొన్నారు. ఆ ప్రాంతంలో ఓ చెట్టుకు తెల్లటి ప్లాస్టిక్ తాడుతో వేలాడుతున్న అస్థిపంజరాన్ని ఎస్సై బాలరాజు పరిశీలించారు. డెడ్‌బాడీ కుళ్లి ఎముకుల గూడుగా మారడంతో సుమారు 45-60 రోజుల క్రితం మరణించినట్లు భావిస్తున్నారు. హత్యా? సూసైడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.