News March 15, 2026

చిత్తూరు: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆదివారం తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాలలో ఎవరు గుంపులు గుంపులుగా రాదని, జెరాక్స్ సెంటర్లు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు.

Similar News

News April 19, 2026

చిత్తూరు: కాలేజీలో కూలిన మెస్ భవనం!

image

చిత్తూరులో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరులోని ఓ కళాశాలలో నూతనంగా నిర్మించిన మెస్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. కూలిన సమయంలో ఆ భవనంలో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశంపై సంబంధిత కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. వాస్తు దోషం కారణంగా ఈ భవనాన్ని కూల్చివేసినట్లు చెబుతున్నారు.

News April 19, 2026

చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

image

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News April 19, 2026

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ ఇయర్‌లో 12,567 మందికి 8,691 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 11,651 మందికి 8,280 మందే పాసయ్యారు, 3,371 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించాలి.