News March 15, 2026

అనకాపల్లి: జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన అక్షరాంధ్ర పరీక్ష

image

అనకాపల్లి జిల్లాలో ఆదివారం నిర్వహించిన అక్షరాంధ్ర పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అనకాపల్లి జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లాలో 2,478 పరీక్షా కేంద్రాల్లో 93, 292 మంది అభ్యాసకులు పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. జిల్లాను శత శాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

Similar News

News April 3, 2026

నిర్మల్: సీఎం పర్యటన.. కలెక్టర్ దిశానిర్దేశం

image

ముఖ్యమంత్రి బాసర పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సీఎం బాసర చేరుకున్న నుంచి, ఆలయ సందర్శన, పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, తిరిగి వెళ్లేవరకు వివిధ శాఖల అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్, ఆలయం లోపల, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలన్నారు.

News April 3, 2026

KU: BLISc పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కాకతీయ విశ్వవిద్యాలయంలో 2026 ఏప్రిల్ 15 నుంచి 29 వరకు BLISc థియరీ పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. లైబ్రరీ క్లాసిఫికేషన్ ప్రాక్టికల్ పరీక్షలు మే 2, 5 తేదీల్లో బ్యాచ్‌ల వారీగా కేయూ దూరవిద్యా కేంద్రంలో కండక్ట్ చేస్తారు. అభ్యర్థులు పూర్తి షెడ్యూల్ కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. ఏమైనా తప్పులుంటే పరీక్షల నియంత్రణాధికారికి తెలపవచ్చు.

News April 3, 2026

జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు బాన్సువాడ అమ్మాయి

image

బిచ్కుంద మండలం కందర్పల్లిలో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో బాన్సువాడ డివిజన్‌కు చెందిన సింధు స్వర్ణ పతకం సాధించింది. 100 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విజేతలు ఈ నెల 9 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని కామారెడ్డి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ కోరారు.