News March 15, 2026
ఎన్నికల వే‘ఢీ’.. సమ్మర్‌లో సమరమే!

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల <<19389988>>షెడ్యూల్‌తో<<>> వేసవిలో ఎలక్షన్ వే‘ఢీ’ మొదలైంది. అస్సాం మినహా మూడింట(TN, బెంగాల్, కేరళం) BJPయేతర ప్రభుత్వాలే ఉండటంతో సమరం రంజుగా సాగనుంది. ఆయా రాష్ట్రాల్లో పట్టు సాధించాలని BJP చూస్తుండగా మరోసారి ప్రభుత్వాలను నిలబెట్టుకోవాలని స్టాలిన్, మమత, విజయన్ పోరాడుతున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పార్టీల ప్రచారాలు, రాజకీయ విమర్శలతో ఈసమ్మర్ హాట్‌హాట్‌గా సాగనుంది.
Similar News
News April 4, 2026
గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కూ షూ, బెల్ట్

TG: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకూ షూ, బెల్ట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇస్తున్న యూనిఫామ్, నోట్ బుక్స్, పుస్తకాలకు ఇవి అదనం. వీటితో పాటు కొత్తగా బెల్ట్, బ్లాక్ షూ, రెండు జతల సాక్సులను జూన్ 12 నుంచే అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు KGBV, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు ఎలాంటి వ్యత్యాసం లేకుండా 18రకాల వస్తువులు ఇవ్వనున్నారు.
News April 4, 2026
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్.. ఈ నెల 10 వరకు గడువు

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 10 వరకు గడువుంది. 17.5-21 ఏళ్ల వయసున్న అవివాహితులు అర్హులు. నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్ డ్యూటీకి టెన్త్‌లో 45%, అగ్నివీర్ టెక్నికల్(MPC)/క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు 12thలో 60% మార్కులు వచ్చి ఉండాలి. అప్లికేషన్ ఫీజు ₹250. మరిన్ని వివరాలకు joinindianarmy.nic.in చూడండి.
News April 4, 2026
బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.


