News March 16, 2026
ఆస్కార్స్‌లో మెరవనున్న భారతీయ అందం

లాస్ ఏంజెలిస్‌లో రేపు ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఇండియన్ టైమ్ ప్రకారం తెల్లవారుజామున 4.30 గంటలకు అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం మొదలవుతుంది. వేదికపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా సందడి చేయనున్నారు. పలువురు విజేతలకు ఆమె ఆస్కార్ అవార్డులు ప్రజెంట్ చేస్తారు. గతంలో ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చినప్పుడు దీపికా పదుకొణె అంతర్జాతీయ స్టేజీపై మెరిసిన విషయం తెలిసిందే.
Similar News
News April 7, 2026
దేవరకొండ ఖిల్లా.. అభివృద్ధి చేస్తే అద్భుతమే

13వ శతాబ్దంలో రేచర్ల రాజులు నిర్మించిన దేవరకొండ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే అద్భుతమైన గుర్తింపు వస్తుంది. 7 కొండలను కలుపుతూ 500 ఎకరాల్లో విస్తరించిన ఈ కోటలో శిల్పకళా వైభవం ఉట్టిపడే కట్టడాలున్నాయి. శిథిలమవుతున్న ఈ చారిత్రక సంపదను కాపాడి, నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తే సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
News April 7, 2026
ఇండక్షన్ స్టవ్‌లపై కేంద్రం కీలక నిర్ణయం

ఇండక్షన్ స్టవ్‌లకు జులై 1 నుంచి అమలు కావాల్సిన స్టార్ రేటింగ్ నిబంధనను కేంద్ర ప్రభుత్వం 6 నెలల పాటు వాయిదా వేసింది. దేశంలో ప్రస్తుతం ఉన్న వంటగ్యాస్ కొరత దృష్ట్యా ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త నిబంధనల వల్ల మార్కెట్లోకి స్టవ్‌లు రావడం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిబంధనలు ఇప్పుడు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
News April 7, 2026
19 ఏళ్లకే తొలి లవ్ బ్రేకప్: అడివి శేష్

తనకు లవ్ బ్రేకప్ కథలంటే ఇష్టమని అడివి శేష్ తెలిపారు. ‘డెకాయిట్’ ప్రమోషన్లలో మాట్లాడుతూ ‘19 ఏళ్లకే తొలిసారి ప్రేమలో విఫలమయ్యా. దాని నుంచి కోలుకోవడానికి పదేళ్లు పట్టింది. ఆ ఫీలింగ్‌ను ఈ మూవీలో హరి పాత్ర ద్వారా చూపే ప్రయత్నం చేశా. నా ప్రతి కథలోనూ బ్రేకప్ ప్రభావం కొంతైనా ఉంటుంది. నేను సిగరెట్స్, మందు, నాన్ వెజ్ తీసుకోను. అందుకే ఇప్పటికీ ఒకేలా ఉన్నా’ అని చెప్పారు. కాగా ఈ చిత్రం APR 10న విడుదల కానుంది.


