News May 5, 2024
పెద్దిరెడ్డీ! నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయి: లోకేశ్

పాపాల పెద్దిరెడ్డీ! నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ‘తంబళ్లపల్లి(మం) కూటగోళ్లపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సతీమణి సమక్షంలో తాగునీరు కోసం నిలదీసిందని నిండు గర్భిణిపై పెద్దిరెడ్డి ముఠాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ పాపాలకు తగిన శిక్ష మే 13న జనం విధిస్తారు పెద్దిరెడ్డీ’ అని ట్విట్ చేశారు.
Similar News
News January 10, 2026
చిత్తూరులో రేపు వడ్డే ఓబన్న జయంతి

చిత్తూరు కలెక్టరేట్‌లో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు జయంతి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానునట్లు పేర్కొన్నారు.
News January 10, 2026
సూళ్లూరుపేట: పక్షుల పండుగ.. నేటి కార్యక్రమాలు

ఉ. 9 గంటలు: S.పేట హోలీక్రాస్ సర్కిల్ నుంచి కళాశాల మైదానం వరకు శోభాయాత్ర
9.30- 12 : పక్షుల పండుగ, స్టాళ్ల ప్రారంభం
సా.5 : సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లెమింగోపై పాటకు డాన్స్, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల రక్షితకేంద్రం, పులికాట్ సరస్సులో వేట విన్యాసాలపై వీడియో ప్రదర్శన, లైటింగ్ ల్యాంప్
సా.6.30కి ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఆవిష్కరణ
సా.7గంటలకు అతిథుల ప్రసంగాలు
సా.7.30-10 గంటల వరకు పాటకచ్చేరి, డాన్స్
News January 10, 2026
బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని ఒకరి స్పాట్ డెడ్

బంగారుపాళ్యం మండలం బలిజపల్లి సమీపంలో కంటైనర్ వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు మేరకు.. శుక్రవారం రాత్రి బలిజపల్లి సమీపంలో గల ఫ్లైఓవర్ వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న కంటైనర్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని హాస్పిటల్‌కి తరలించారు.


