News May 5, 2024

11న భీమవరానికి అమిత్ షా: తపనా చౌదరి

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 11న భీమవరానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ స్థలాన్ని, రూట్ మ్యాప్‌ను స్థానిక నేతలతో కలిసి ఆదివారం బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారపాడు తపనా చౌదరి పరిశీలించారు. అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు.

Similar News

News July 11, 2025

ప.గో: 641.544 కిలోల గంజాయి ధ్వంసం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాధీనం చేసుకున్న 641.544 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా కొండవీడులోని జిందాల్ అర్బన్ మేనేజ్‌మెంట్ ఈ-వేస్టేజ్ లిమిటెడ్‌లో అధికారులు ధ్వంసం చేశారు. 64 కేసులకు సంబంధించిన ఈ గంజాయిని బాయిలర్‌లో వేసి కాల్చివేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News July 11, 2025

భీమవరం: రైతుల అభ్యంతరాలపై జేసి ఛాంబర్‌లో విచారణ

image

జాతీయ రహదారి 165 నిర్మాణంలో భాగంగా ఉండి మండలం పెద్దపుల్లేరు గ్రామం రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై జేసి రాహుల్ గురువారం అధికారుల సమక్షంలో విచారణ చేపట్టారు. భూసేకరణపై జూన్ 14న అభ్యంతరాలు గడువు ముగియడంతో ఆ గ్రామం నుంచి అందిన 5 మంది రైతులు అభ్యంతరాలపై నేడు విచారణ జరిగింది. మూడు అంశాలపై రైతులు అభ్యంతరాలను వ్యక్తపరచగా వీటిని ఎన్‌హెచ్ అధికారులు పరిష్కరించేందుకు రైతులకు హామీ ఇచ్చారని జేసి తెలిపారు.

News July 10, 2025

భీమవరంల: రాష్ట్ర స్థాయి సెస్ పోటీల బ్రోచర్‌ ఆవిష్కరణ

image

విద్యార్థులకు మేధాశక్తిని పెంపొందించే క్రీడ చెస్ అని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. గురువారం భీమవరంలో ఈ పోటీల బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహకులు మాదాసు కిషోర్ మాట్లాడారు. అనసూయ చెస్ అకాడమీ, వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన గ్రంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏ.పీ. స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను జరుపుతున్నామన్నారు.