News March 16, 2026
మోపాల్: బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సినీ దర్శకుడు బలగం వేణు

మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి ఇందూరు తిరుమల క్షేత్ర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారికి చక్ర స్నానం, రథోత్సవం జరిపారు. సాయంత్రం పుష్ప యాగం నిర్వహించారు. ఈ వేడుకల్లో సినీ దర్శకుడు, నటుడు బలగం వేణు, సినీ నిర్మాత దిల్ రాజు, శిరీశ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవనాథ జీయర్ స్వామి ప్రవచించారు.
Similar News
News March 27, 2026
45 ఏళ్లకే ₹కోటితో రిటైర్‌మెంట్: ఏం చేయాలి?

30 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసి 45 ఏళ్లకు రిటైర్ అవ్వడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. నెలకు ₹14,500 ఇన్వెస్ట్ చేస్తూ 15 ఏళ్లలో ₹1 కోటి సంపాదించొచ్చు. ఇందులో ₹5,000 గోల్డ్‌లో, ₹9,500 MFలో పెట్టాలి. ఏటా పెట్టుబడిని 10% పెంచుతూ వెళ్తే కాంపౌండింగ్ పవర్‌తో మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. గోల్డ్ ద్వారా సుమారు ₹20 లక్షలు, MF ద్వారా ₹82 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది.
News March 27, 2026
వేసవికాలం.. కర్నూలు ఎస్పీ కీలక సూచనలు!

వేసవికాలపు సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈత రాని పిల్లలు కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో నీటి వనరుల వద్ద జారిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
News March 27, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 27)

1845: ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం
1985: సినీ నటుడు రామ్ చరణ్ జననం
1937: నటి, నృత్య కళాకారిణి రాగిణి జననం
1968: అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మనిషి యూరీ గగారిన్ మరణం
☛ ప్రపంచ రంగస్థల దినోత్సవం


