News March 16, 2026

విశాఖలో రోడ్డు ప్రమాదం.. తుని యువతి మృతి

image

విశాఖపట్నం BHPV వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందారు. స్కూటీపై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో పార్వతీపురానికి చెందిన సీహెచ్ అనూష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తుని గవరపేటకు చెందిన ఆడారి కుసుమాంజలి మహాలక్ష్మి (19) చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. ఈ ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 20, 2026

విజయ్ విడాకుల కేసు.. నేడే విచారణ

image

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్‌కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్‌మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.

News April 20, 2026

ఓపెన్ స్కూల్ పరీక్షలు…కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు మొదలుకానున్నాయి. పరీక్షా కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగినా, కేంద్రాలకు సంబంధించి సమాచారం కావాలన్నా తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు 9440728543 నంబర్లకు, ఖమ్మం జిల్లాకు సంబంధించి 8008403522, 8142406769 నంబర్లకు సంప్రదించాలని డీఈఓ చైతన్యజైనీ సూచించారు.

News April 20, 2026

VJA: సీఎం రాక నేపథ్యంలో.. పోలీసుల అలర్ట్

image

సీఎం చంద్రబాబు సోమవారం అన్న క్యాంటీన్‌ను సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదివారం రాత్రి నుంచే బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు క్యాంటీన్ పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. రహదారులు, పార్కింగ్ స్థలాలు, సమీప భవనాలను క్షుణ్ణంగా సోదా చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.