News March 16, 2026

అవతార్‌కు ఆస్కార్.. విమర్శలు!

image

అవతార్ ఫైర్ అండ్ యాష్‌కు విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. అయినా ఆస్కార్ రావడంపై కొందరు IND సినీ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. హాలీవుడ్‌లో సినిమాలు ఎలా ఉన్నా ఆస్కార్ ఈజీగా వస్తుందని, భారతీయ చిత్రాలు ఎంత బాగా తీసినా ఇవ్వరని కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజువల్ వండర్ కావడంతోనే అవతార్‌కు అవార్డు వచ్చిందని మరికొందరు అంటున్నారు. మీ కామెంట్?

Similar News

News April 19, 2026

అశ్వగంధ ఆకులతో హాని.. వాడొద్దు: FSSAI

image

ఔషధాలు, ఆహార ఉత్పత్తుల్లో అశ్వగంధ వేర్లు లేదా దాని సారాన్ని మాత్రమే వాడాలని తయారీదారులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఆదేశించింది. ఆకులను పౌడర్ రూపంలో లేదా వేరే ఏ ఇతర రూపంలోనూ వాడకూడదంటూ నిషేధం విధించింది. ఈ ఆకుల వాడకం వల్ల కాలేయం, నరాలు, జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదముందని తెలిపింది. కంపెనీలు తాము మొక్కలోని ఏ భాగాన్నీ వాడుతున్నదీ తప్పనిసరిగా పేర్కొనాలని సూచించింది.

News April 19, 2026

‘జైలర్-2’కు రికార్డ్ బ్రేకింగ్ OTT డీల్?

image

రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. మొదటి పార్ట్ కంటే రెట్టింపు ధరకు డీల్ కుదరడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.

News April 19, 2026

అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

image

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.