News May 6, 2024
మే 06: చరిత్రలో ఈ రోజు
1861: స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జననం
1932: సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు జననం
1953: బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ జననం
1954: మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించారు
2006: రచయిత, నిర్మాత తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి మరణం
2021: మ్యూజిక్ డైరెక్టర్ జీ ఆనంద్ మరణం
Similar News
News January 5, 2025
వ్యవసాయ సీట్లకు రేపు స్పాట్ కౌన్సెలింగ్
TG: వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్ డిగ్రీ కోర్సుల్లో ఖాళీ సీట్లకు ఈ నెల 6న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు HYD రాజేంద్రనగర్‌లోని కాలేజీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈఏపీసెట్-2024లో ర్యాంకు సాధించి, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావొచ్చు. వివరాలకు www.pjtsau.edu.inను చూడండి.
News January 5, 2025
భారత్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 157 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 141/6తో టీమ్ ఇండియా మూడో రోజు ప్రారంభించగా వరుసగా జడేజా(13), సుందర్(12), సిరాజ్(4), బుమ్రా(0) వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్ బోలాండ్ 6 వికెట్లతో చెలరేగారు. కమిన్స్ 3 వికెట్లు తీశారు. AUS గెలవాలంటే 162 రన్స్ కావాలి.
News January 5, 2025
పింక్ జెర్సీలో టీమ్ ఇండియా
క్యాన్సర్ పేషెంట్లకు సంఘీభావంగా సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లు పింక్ కలర్ డ్రెస్‌లో బరిలోకి దిగారు. ఈ మ్యాచ్ తొలిరోజు నుంచే ఆసీస్ ఆటగాళ్లు పింక్ జెర్సీ ధరించి ఆడుతున్నారు. అయితే నిన్నటివరకు బ్లూకలర్ జెర్సీతో ఆడిన భారత ఆటగాళ్లు ఇవాళ పింక్ జెర్సీ ధరించారు. ప్రేక్షకులు కూడా దాదాపు అందరూ ఆ కలర్ దుస్తులే ధరించి రావడంతో స్టేడియమంతా పింక్‌మయమైంది. అటు మూడోరోజు కాసేపటికే జడేజా, సుందర్ ఔట్ అయ్యారు.