News May 6, 2024

నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ

image

AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ఎల్లుండి పీలేరులో జరిగే బహిరంగ సభ, విజయవాడలో జరిగే రోడ్ షోలో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు పోలీసులు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను భద్రతా బలగాలు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి.

Similar News

News January 5, 2025

భారత్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

image

ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 157 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 141/6తో టీమ్ ఇండియా మూడో రోజు ప్రారంభించగా వరుసగా జడేజా(13), సుందర్(12), సిరాజ్(4), బుమ్రా(0) వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్ బోలాండ్ 6 వికెట్లతో చెలరేగారు. కమిన్స్ 3 వికెట్లు తీశారు. AUS గెలవాలంటే 162 రన్స్ కావాలి.

News January 5, 2025

పింక్ జెర్సీలో టీమ్ ఇండియా

image

క్యాన్సర్ పేషెంట్లకు సంఘీభావంగా సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లు పింక్ కలర్ డ్రెస్‌లో బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌ తొలిరోజు నుంచే ఆసీస్ ఆటగాళ్లు పింక్ జెర్సీ ధరించి ఆడుతున్నారు. అయితే నిన్నటివరకు బ్లూకలర్ జెర్సీతో ఆడిన భారత ఆటగాళ్లు ఇవాళ పింక్ జెర్సీ ధరించారు. ప్రేక్షకులు కూడా దాదాపు అందరూ ఆ కలర్ దుస్తులే ధరించి రావడంతో స్టేడియమంతా పింక్‌మయమైంది. అటు మూడోరోజు కాసేపటికే జడేజా, సుందర్ ఔట్ అయ్యారు.

News January 5, 2025

పడిపోతున్న టెంపరేచర్.. వణికిస్తున్న చలి

image

తెలంగాణలో చలి వణికిస్తోంది. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే టెంపరేచర్ నమోదవుతోంది. నిన్న అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన తొమ్మిదేళ్లలో ఇక్కడ ఇదే కనిష్ఠ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 6.1, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 6.2, కామారెడ్డి జిల్లా డోంగ్లి, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.8 చొప్పున టెంపరేచర్ నమోదైంది.