News March 16, 2026

పెద్దపల్లి: హెచ్‌టీ సర్వీసులకు సింగిల్ విండో విధానం

image

హెచ్‌టీ 11 కేవీ, 33 కేవీపై వోల్టేజ్ విద్యుత్ సర్వీసుల మంజూరును వేగవంతం చేసేందుకు సింగిల్ విండో వ్యవస్థ ఉపయోగపడుతుందని PDPL సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ గంగాధర్ తెలిపారు. ఇప్పటివరకు ఈ విధానం ద్వారా 542 సర్వీసులు మంజూరు చేసినట్లు చెప్పారు. దరఖాస్తులను TGNPDCL పోర్టల్‌లో నమోదు చేసుకుని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించడంతో పారదర్శకత పెరిగిందన్నారు.

Similar News

News April 13, 2026

NGKL జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

image

NGKL జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయని డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 10,658 మంది విద్యార్థులకు గాను 10,637 మంది హాజరయ్యారని, 21 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 99.80 శాతం హాజరు నమోదైందని, పరీక్షల నిర్వహణలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన వెల్లడించారు.

News April 13, 2026

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: ఎస్పీ

image

అమలాపురంలో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ రాహుల్ మీనా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అదనపు ఎస్పీ ప్రసాద్‌తో కలిసి మొత్తం 24 అర్జీలను స్వీకరించిన ఆయన, బాధితులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కోరారు.

News April 13, 2026

ములుగు జిల్లాలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాలు ఎక్కడంటే!

image

ములుగు జిల్లాలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. మంగళవారం రాయనిగూడెం మ.3గం, సర్వాపురం సా.6గం, బుధవారం రాజుపేట మ.3గం, మల్లూరు సా.6గ గ్రామాల్లో మంత్రి ధనసరి సీతక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రజలు తమ సమస్యలు, పథకాల విన్నపాలు నేరుగా అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ కోరారు. అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.