News March 16, 2026

BIG BREAKING: ADB: మాజీ MLA మృతి

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మాజీ MLA అజ్మీరా గోవింద్ నాయక్ కాసేపటి క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం ఆయన దండేపల్లి మండలం లింగాపూర్‌లో ఉన్న తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గోవింద్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 3 సార్లు MLAగా గెలుపొందారు. మొదటి సారి ఇండిపెండెంట్‌గా గెలవగా ఆ తర్వాత TDP, BRS నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంత కాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో మంచానికే పరిమితమయ్యారు.

Similar News

News April 11, 2026

బాలీవుడ్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్లీ బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీతో కలిసి భారీ పాన్ ఇండియా సినిమా తీయనున్నట్లు సమాచారం. దాదాపు ₹800 కోట్ల బడ్జెట్‌తో హిస్టారికల్ జంగిల్ అడ్వెంచర్‌ రూపొందనుందని టాక్. భన్సాలీ తన ‘గంగూబాయి కతియావాడి’ విజయం తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. చరణ్ 2013లో ‘జంజీర్’(తుఫాన్)తో బాలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

News April 11, 2026

మహిళలను వేధిస్తే గుణపాఠం తప్పదు: రాయపాటి శైలజ

image

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్ఐ వ్యవహారశైలిని ఆమె తీవ్రంగా ఖండించారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పల్నాడు ఎస్పీని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

News April 11, 2026

ప్యారడైజ్‌లో ‘సుబ్బు’గా కయాదు.. లుక్ అదుర్స్!

image

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కయాదు లోహర్ బర్త్ డే సందర్భంగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ‘సుబ్బు’ పాత్రలో నటిస్తున్న కయాదు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైట్& బ్లూ కలర్ డ్రెస్‌లో క్యాప్ ధరించి వింటేజ్ లుక్‌లో సైకిల్‌పై వెళ్తున్న ఈ ముద్దుగుమ్మ లుక్ ఆకట్టుకుంటోంది.