News May 6, 2024

నేడు అనకాపల్లి జిల్లాకు ప్రధాని మోదీ

image

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఆయన కసింకోట మండలం తాళ్లపాలెం సమీపంలో జరిగే ప్రచార సభలో పాల్గొన్నారు. సాయంత్రం 5:30కు ఆయన సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. తిరిగి 7:10కి విశాఖ ఎయిర్పోర్ట్‌కు వెళ్లనున్నారు. ఈ ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే అధికారులు భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News July 11, 2025

విశాఖలో ఈసాయ్ సంస్థ విస్తరణ

image

విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి నాటికి ఈ కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే జేఎన్ ఫార్మా సిటీలో తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఈసాయ్ సంస్థ ఈ కొత్త కేంద్రంతో భారత్‌లో తన ఉనికిని మరింతగా బలోపేతం చేయనుంది.

News July 11, 2025

షీలానగర్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

షీలానగర్ సమీపంలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడకు చెందిన అశోక్ రెడ్డి బైకుపై వెళుతుండగా ట్రాలర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.

News July 11, 2025

కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’

image

కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’‌ని ప్రవేశపెట్టాలని V.M.R.D.A. నిర్ణయించింది.‌ సింగపూర్‌లోని సెంటోసా వద్ద ఈ రైడ్ అత్యంత ప్రజాదరణ పొందింది.‌ గురుత్వాకర్షణ ఆధారంగా ఈ వినోదాత్మక రైడ్ ఉంటుంది.‌ అన్ని వయస్సుల వారు ఈ రైడ్‌ను ఆస్వాదించవచ్చని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.‌ కైలాసగిరిపై ఇది‌ మంచి టూరిస్టు ఆకర్షణ అవుతుందని భావిస్తున్నామని ఎంసీ విశ్వనాథన్ తెలిపారు.