News May 6, 2024
మంచిర్యాల: వరుడి ఇంటి ముందు నవ వధువు ఆందోళన

ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు ఆందోళన చేసింది. వివరాలిలా.. గత నెల 24న BPL మండలం కాసిరెడ్డిపల్లెకు చెందిన ప్రవీణ్‌కు MNCLకు చెందిన ఓ యువతి(22)తో వివాహమైంది. పెళ్లయిన నాలుగో రోజే ఆమెను తల్లిగారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఇంట్లో అన్నం తినకుండా, జ్యూస్‌లే తాగుతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు విస్తుపోయారు. ఎస్ఐ నరేశ్ సోమవారం ఇరువర్గాలను కౌన్సిలింగ్‌కు రావాలని చెప్పామన్నారు.
Similar News
News September 12, 2025
ADB: కూలిన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం సాయంత్రం కూలిన పురాతన భవనాన్ని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. తహసిల్దార్ శ్రీనివాస్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని వారు తెలిపారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని వారు చెప్పారు.
News September 11, 2025
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయని ఆదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జాగ్రామ్ తెలిపారు. 2025 జూన్, జూలై నెలలో నిర్వహించిన డిగ్రీ 2వ సంవత్సరం, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. https://online.braou.ac.in/UGResults/cbcsResults అనే వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు.
News September 11, 2025
అంబేడ్కర్ వర్సిటీలో చేరేందుకు రేపే ఆఖరు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 12వ తేదీ వరకు గడువు ఉందని సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత, ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జగ్రామ్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజనులకు ఉచితంగా విద్య అందించే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని వారు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.