News March 17, 2026

WGL: రంజాన్ తోఫాలు 10,250!

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ‘ఈద్ కా తోఫా’ పంపిణీ చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,250 కిట్లను పంపిణీ చేయనున్నారు. వరంగల్‌కు 3 వేలు, హనుమకొండ 2,500, జనగామ 2 వేలు, మహబూబాబాద్‌ 1,250, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు 750 చొప్పున కిట్లు కేటాయించారు. స్థానిక మసీదు కమిటీల ఆధ్వర్యంలో వీటిని అందజేయనున్నారు.

Similar News

News March 20, 2026

కేయూ: బీ.ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ టైమ్ టేబుల్ విడుదల

image

బీ.ఫార్మసీ (CBCS) ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 24 నుంచి ప్రారంభమై 30 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. వరంగల్, హనుమకొండ సహా పలు కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరిన్ని వివరాలను అధికారిక వైబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.

News March 20, 2026

ఆసీస్ ప్లేయర్లు కావాలనే రావడం లేదా?

image

IPL ఆరంభ మ్యాచులకు కమిన్స్(SRH), స్టార్క్(DC), హేజిల్‌వుడ్(RCB) రావడం లేదు. ఎల్లిస్(CSK) సీజన్ మొత్తానికి దూరమయ్యారు. గాయాల భయంతో ఆస్ట్రేలియన్లు IPL ఆడేందుకు ఇష్టపడడం లేదని, కావాలనే మ్యాచులకు డుమ్మా కొడుతున్నట్లు కొందరు IND ఫ్యాన్స్ అంటున్నారు. ఫ్రాంచైజీల నుంచి రూ.కోట్లు తీసుకుంటూ స్వదేశం తరఫున ఆడేందుకే మొగ్గు చూపుతున్నారు. అలాంటప్పుడు వేలంలో పాల్గొనడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?

News March 20, 2026

జగిత్యాల: జనగణన పకడ్బందీగా నిర్వహించాలి

image

జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, రాజా గౌడ్ అధికారులను ఆదేశించారు. జనగణన-2027లో భాగంగా మొదటి దశలో చేపట్టనున్న ‘హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్’పై అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు.