News May 6, 2024

VZM: ఒకే గ్రామం.. రెండు మండలాలు

image

ఏ గ్రామానికైనా ఒకటే మండల కేంద్రం ఉంటుంది. కానీ కురుపాం నియోజకర్గంలోని మార్కొండపుట్టికి 2 మండల కేంద్రాలున్నాయి. గరుగుబిల్లి మండలంలో ఉన్న మార్కొండపుట్టి.. తోటపల్లి డ్యాంలో ముంపునకు గురవ్వడంతో వారికి కొమరాడ మండల పరిధిలో నిర్వాసితకాలనీ ఏర్పాటు చేశారు. దీంతో భూసమస్యలకు గరుగుబిల్లి.. కుల, ఆదాయ ఇతర పనులకు కొమరాడ మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. మరి ఈ సమస్యను పాలకులు పట్టించుకుంటారో లేదో చూడాలి.

Similar News

News September 27, 2025

వర్షాలను దృష్టిలో ఉంచుకొని పండగ ఏర్పాట్లు: RDO

image

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పైడితల్లి పండగ ఏర్పాట్లను చేసుకోవాలని RDO దాట్ల కీర్తి తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. గుడి లోపల దేవస్థానం సిబ్బంది ఎక్కువ మంది ఉండడంతో భక్తుల తోపులాట జరుగుతోందన్నారు.

News September 27, 2025

VZM: రేపటి నుంచి అఖిల‌భార‌త డ్వాక్రా బ‌జార్‌

image

దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ స్వ‌యం స‌హాయ‌క సంఘాలు రూపొందించే ఉత్పత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌కు అఖిల భార‌త డ్వాక్రా బ‌జార్ గొప్ప వేదిక‌గా నిలవ‌నుంద‌ని క‌లెక్ట‌ర్ రామ సుంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. త‌న ఛాంబ‌ర్‌లో మీడియాతో శ‌నివారం మాట్లాడారు. ఆదివారం నుంచి మ‌నంద‌రికీ అందుబాటులో విజ‌య‌న‌గ‌రంలో ప్రారంభంకానున్న ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌జ‌లంతా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

News September 27, 2025

VZM: ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం..!

image

జిల్లాలోని రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో 17, బొబ్బిలిలో 27, చీపురుప‌ల్లిలో 4, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో 3, నెల్లిమ‌ర్ల‌లో 4, విజ‌య‌న‌గ‌రంలో 61, ఎస్‌.కోట నియోజ‌క‌వ‌ర్గంలో 10 మొత్తం 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువ‌గా ఓట‌ర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, త‌ర‌లింపులు, కొత్త కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని DRO శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు.