News March 17, 2026

వరంగల్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో ‘మ్యానువల్’ దోపిడీ!

image

వరంగల్ రైల్వే స్టేషన్ వాహనాల పార్కింగ్ కేంద్రంగా భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మూడు నెలలుగా వాహనదారులకు కంప్యూటర్ బిల్లులకు బదులు మ్యానువల్ బిల్లులు ఇస్తూ జీఎస్టీ వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కంప్యూటర్ బిల్లుల్లో జీఎస్టీ కలిపి ఇస్తేనే అది ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. అయితే, మ్యానువల్ బిల్లుల ద్వారా వసూలు చేస్తున్న ఈ సొమ్ము పక్కదారి పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Similar News

News April 11, 2026

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు ప్రకటన

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల పరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే చివరి వరకు దేశంలోని వివిధ సెంటర్లలో <>ఎగ్జామ్స్<<>> జరుగుతాయని పేర్కొంది. కాగా ఫిబ్రవరి 23నే పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, NCBలో మొత్తం 25,487 ఉద్యోగాలు ఉన్నాయి.
Share It

News April 11, 2026

జగిత్యాల: జ్యోతిబా ఫూలేకు బీఆర్‌ఎస్ నాయకుల ఘననివాళి

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహా పలువురు నేతలు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఫూలే సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.

News April 11, 2026

రేపటి వరకు వర్షాలు!

image

ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సముద్ర మట్టానికి 0.9కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఆస్కారముందని వివరించింది.