News May 6, 2024
జాగ్రత్త! అలాంటి ఖాతాలకు స్పందించకండి: సజ్జనార్
TG: సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫేక్ స్కైప్ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ‘జాగ్రత్త! మీ పేరుతో డ్రగ్ పార్శిల్స్ వచ్చాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అలాంటి ఖాతాలకు స్పందించకండి. అప్రమత్తంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే https://cybercrime.gov.in/ వెబ్‌సైట్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.
Similar News
News December 29, 2024
నితీశ్ కుమార్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
నితీశ్ కుమార్ రెడ్డి తెలుగువాడైనందుకు గర్వంగా ఉందని చాలా మంది పోస్టులు పెడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నువ్వు “భారత్”లోని ఏ ప్రాంతం నుంచి వచ్చావనే దానికంటే దేశం గర్వించేలా ఏం చేశావన్నదే ముఖ్యం. ఇలాంటి వరల్డ్ క్లాస్ రికార్డులెన్నో సాధించాలని కోరుకుంటున్నా. భారత జెండాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.
News December 29, 2024
₹12 కోట్ల ఘరానా మోసం.. నిందితుల అరెస్టు
CRED యాప్‌ను పర్యవేక్షించే Dreamplug Paytech Solutions బ్యాంకు ఖాతాల నుంచి ₹12 కోట్లు లూటీ చేసిన నలుగురు నిందితులను బెంగళూరు సైబర్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. Axis బ్యాంకు రిలేషన్‌షిప్ మేనేజర్ వైభవ్ పిథాడియా బ్యాంకు, ఇన్సూరెన్స్ ఏజెంట్లతో కలిసి క్రెడెన్షియల్స్ మార్పు, తప్పుడు పత్రాలతో Dreamplug ఖాతాల యాక్సెస్ పొందారు. 37 లావాదేవీల ద్వారా ₹12.20 కోట్లను ఇతర ఖాతాలకు మళ్లించారు.
News December 29, 2024
పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా?: హరీశ్ రావు
TGలో ఇటీవల పోలీసుల వరుస ఆత్మహత్య ఘటనలపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. పోలీసుల మరణ మృదంగంపై ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. పలు అంశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వారిపై ప్రభావం చూపిస్తోందన్నారు. పోలీసులకు సూసైడ్ ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.