News May 6, 2024
HYD: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక

HYD కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగినా.. పాదచారులకు ఇబ్బందులు కలిగించినా సెక్షన్ 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ DCP వినీత్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదేశాలు బేఖాతరు చేస్తూ బ్రిడ్జిపై మాదాపూర్ SHO మల్లేశ్, మరో ముగ్గురు సీఐలు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News September 13, 2025
సిటీకి రానున్న మీనాక్షి నటరాజన్.. వారం పాటు మకాం

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈనెల 16న హైదరాబాద్‌కు వస్తున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఈ వారం నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.
News September 13, 2025
‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.
News September 13, 2025
HYD: గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్.. విధుల్లో కొనసాగింపు

గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరిని ఈ విద్యాసంవత్సరానికి కూడా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంతోపాటు వివిధ జిల్లాల్లో దాదాపు 970 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరంతా వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు విధుల్లో ఉంటారు.