News May 6, 2024
HYD: రేపు బీసీల రాష్ట్ర స్థాయి సదస్సు: ఆర్.కృష్ణయ్య

ఈనెల 7వ తేదీన HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆయన బీసీ భవన్‌లో మాట్లాడారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ద్వారా చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, బీసీలకు రాజ్యాంగ హక్కుల కల్పన, కుల గణన డిమాండ్ల పరిష్కారం కోరుతూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 13, 2025
సిటీకి రానున్న మీనాక్షి నటరాజన్.. వారం పాటు మకాం

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈనెల 16న హైదరాబాద్‌కు వస్తున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఈ వారం నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.
News September 13, 2025
‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.
News September 13, 2025
HYD: గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్.. విధుల్లో కొనసాగింపు

గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరిని ఈ విద్యాసంవత్సరానికి కూడా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంతోపాటు వివిధ జిల్లాల్లో దాదాపు 970 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరంతా వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు విధుల్లో ఉంటారు.