News March 18, 2026
సిరిసిల్ల: లక్కీ డిప్ ద్వారా ‘రేవంతన్న కా సహారా’ లబ్ధిదారుల ఎంపిక

తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రేవంతన్నా కా సహారా – మిస్కీన్’ పథకం కింద, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఫఖీర్, దూదేకుల, దూదేకుల ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు మోపెడ్‌లు, బైక్‌లు, ఈ-బైక్‌లను అందించే లక్ష్యంతో జిల్లాకు కేటాయించిన ఐదు స్థానాలకు ఐదుగురు లబ్ధిదారులను కలెక్టర్ గరిమా అగ్రవాల్ సమక్షంలో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
Similar News
News March 30, 2026
రాబోయే 2-3 గంటల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, గద్వాల్, కొమురం భీమ్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక మహబూబ్‌నగర్‌లో గరిష్ఠంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు పేర్కొంది.
News March 30, 2026
ఏప్రిల్ 1న నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన

వింజమూరు మండలంలో ఏప్రిల్ 1వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు వింజమూరు చేరుకోనున్న సీఎం, ముందుగా నార్త్ ఎస్సీ కాలనీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పాతూరు చెరువు బండ వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి, మధ్యాహ్నం ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
News March 30, 2026
NTR: బీ.టెక్ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలో డిసెంబర్ 2025లో నిర్వహించిన IV/IV బీ.టెక్(HONOR) 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.


