News March 18, 2026
ఆర్డర్ చేస్తే ‘ఎండ’ డెలివరీ.. రాత్రి కూడా పట్టపగలు!

రాత్రిపూట ఫుడ్ ఆర్డర్ చేసినట్లుగానే ఇకపై ఎండను కూడా ఆర్డర్ చేయొచ్చు. కాలిఫోర్నియా స్టార్టప్ ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ స్పేస్‌లో భారీ అద్దాలతో కూడిన శాటిలైట్లను ప్రయోగించి సూర్యరశ్మిని భూమిపైకి మళ్లించనుంది. గంటకు ₹4.5 లక్షలు చెల్లిస్తే రాత్రి కూడా పట్టపగల్లా వెలుగొస్తుంది. 2035 నాటికి 50,000 శాటిలైట్లను పంపడమే లక్ష్యం. ఈ కృత్రిమ వెలుతురు వల్ల పర్యావరణానికి, పరిశోధనలకు ముప్పు కలుగుతుందనేది ఆందోళన.
Similar News
News April 15, 2026
గుర్తుపెట్టుకోండి.. ‘అతి వినయం ధూర్త లక్షణం’

సహజ విరుద్ధంగా ఎవరి పట్లయినా అధిక వినయం, గౌరవాన్ని ప్రదర్శించేవారిని ప్రస్తావించేటప్పుడు ఈ సూక్తిని వాడతాం. పంచతంత్ర కథలు, చాణక్య నీతి కథల నుంచి ఇది వచ్చింది. వినయంగా ఉండటం మంచిదే. కానీ దాన్ని అతిగా ప్రదర్శిస్తున్నారంటే నమ్మక ద్రోహానికి సంకేతం కావొచ్చు. తమ పనులు సాధించుకోవడానికి మోసగాళ్లు, స్వార్థపరులు ఇలా చేస్తారు. మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎదురయ్యారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 15, 2026
‘AMARAVATHI’ కాదు ‘AMARAVATI’

AP: రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో తప్పుడు స్పెల్లింగ్ వినియోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎలా వాడాలో సూచిస్తూ CS సర్క్యులర్ జారీచేశారు. 2015లో ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ‘AMARAVATI’ని ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే కలెక్టర్లు, ఇతర అధికారులు నివేదికల్లో అమరావతిని ఇంగ్లిష్‌లో ‘AMARAVATHI’ అని రాస్తున్నారని పేర్కొంది. ఇకపై ‘AMARAVATI’ అని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
News April 15, 2026
అమ్మాయిలకు మీసాలు.. కారణమిదే

కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిల్లా మీసాలు, గడ్డాలు రావడంతో పాటు ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. ఈ సమస్యను హిర్సుటిజం(Hirsutism) అంటారు. ఈ సమస్య PCOD, థైరాయిడ్ ఉన్నవారిలో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో చాలా తక్కువ మోతాదులో ఉండే మేల్ హార్మోన్స్ పెరగడం, కొన్నిరకాల మందులు వాడటం వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. సమస్యను గుర్తించగానే వైద్యులను సంప్రదించడం మంచిది.


