News March 18, 2026

నిర్మల్ జిల్లాలోని త్వరలో ‘కిసాన్ మేళా’: కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో త్వరలోనే ‘కిసాన్ మేళా’ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈ మేళాలో సేంద్రీయ వ్యవసాయం, కిచెన్ గార్డెనింగ్, రూఫ్‌టాప్ గార్డెనింగ్‌పై ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రగతిశీల రైతుల అనుభవాలను ఇతరులతో పంచుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని ఆమె స్పష్టం చేశారు.

Similar News

News April 4, 2026

క్యాతనపల్లి: మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు పటిష్ట బందోబస్తు

image

క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. నలుగురు ఏసీపీలు, 23 మంది సీఐలు, 46 మంది ఎస్ఐలు, 98 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, 167 మంది కానిస్టేబుళ్లు, 49 మంది మహిళా పోలీస్, 38 మంది స్పెషల్ పార్టీ, 60 మంది హోంగార్డ్స్, మొత్తం 485, 4టీజీఎస్పీ ఫ్లాటన్స్ విధుల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.

News April 4, 2026

పశ్చిమాసియా యుద్ధం.. నిర్మాణ రంగంపై భారం

image

పశ్చిమాసియా యుద్ధం దేశంలో నిర్మాణ రంగంపై పడింది. రంగులు, స్టీల్, సిమెంట్, టైల్స్, శానిటరీ వేర్ రేట్లు పెరిగాయి. పెట్రోలియం అనుబంధ ఉత్పత్తుల కొరతే దీనికి కారణం. బస్తా సిమెంట్ ధర ₹50 పెరగగా, స్టీల్ ధర టన్నుకు 18% పెరిగింది. ప్రొపేన్ గ్యాస్ సరఫరా తగ్గడంతో శానిటరీ వేర్ ధరలు 8-12% పెరిగినట్లు తెలుస్తోంది. ఇంధన కొరత సాకుతో రవాణా ఛార్జీల రూపంలో ఇటుక ధరలు కూడా ₹8 నుంచి ₹10-12కు పెంచినట్లు సమాచారం.

News April 4, 2026

కామారెడ్డి: గిరిజన యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ

image

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గిరిజన యువతకు కేరళంలోని కోచ్చిలో ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇండస్ట్రియల్ ఎలక్ట్రిషియన్, వెల్డర్ వంటి కోర్సుల్లో ITI, డిప్లొమా పూర్తి చేసిన TG గిరిజన యువతకు 25 సీట్లు కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు APR 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ తెలిపారు.