News March 18, 2026

అమ్రాబాద్: రాత్రివేళల్లో ‘నైట్‌జార్’ పక్షి వింత శబ్దాలు

image

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రాత్రిపూట చురుకుగా ఉండే ‘నైట్‌జార్’ పక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చెట్టు బెరడు రంగులో ఉండటం వల్ల పగలు దీనిని గుర్తించడం కష్టం. రాత్రి వేళల్లో ఇది చేసే వింత శబ్దాలను చూసి స్థానికులు వేరే జంతువులుగా భ్రమపడుతుంటారని అధికారులు తెలిపారు. పురుగులను ఆహారంగా తీసుకునే ఈ పక్షి అడవిలో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది.

Similar News

News April 18, 2026

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని CM వినతి

image

MHBD బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని CM రేవంత్ రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం, పర్యావరణ హితంగా ఉక్కు ఉత్పత్తి చేసే పరిశ్రమల ఆవశ్యకతను వివరించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.

News April 18, 2026

రాముని బండ.. తెలంగాణలో మూడవ భద్రాద్రి!

image

జగదేవ్‌పూర్ మండలం జంగంరెడ్డిపల్లి సమీపాన కొలువైన ‘రాముని బండ’ శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రం మహిమాన్విత పుణ్యస్థలిగా వెలుగొందుతోంది. భద్రాచలం, జీడికల్లు తర్వాత శ్రీరాముడు స్వయంభువుగా వెలసిన మూడవ క్షేత్రం ఇదే కావడం విశేషం. పూర్వం సీతమ్మ దాహం తీర్చేందుకు రాముడు బాణంతో ఉద్భవింపజేసిన ఇక్కడి ‘రామగుండం’లోని నీరు ఎన్నటికీ ఎండిపోదు. ఇక్కడ స్నానం చేస్తే పిల్లల్లో శారీరక రుగ్మతలు తొలగిపోతాయని నమ్మకం.

News April 18, 2026

బోల్డ్ ఫొటోకు కోహ్లీ లైక్.. మోడల్ ఏమన్నారంటే?

image

విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా ఫొటోను <<19671107>>లైక్<<>> చేసి తర్వాత అన్‌లైక్ చేయడంపై జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ స్పందించారు. ‘విరాట్ నా ఫొటోకి లైక్ చేసినప్పుడు ఎంతో సంతోషించా. దానివల్ల SMలో ఇంతగా వైరల్ అవుతానని అనుకోలేదు. ఆ ఫొటోకు లైక్ చేయడంలో ఆయనకు దురుద్దేశం లేకపోయినా నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది చూసి ఆయనపై కాస్త జాలి కలిగింది. కోహ్లీ నుంచి లభించిన మద్దతుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.