News March 18, 2026

గ్యాస్ కొరత: ఇన్‌స్టంట్ ఫుడ్ సేల్స్‌లో 20% జంప్

image

వంట గ్యాస్ కొరత తీవ్రం కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. సిలిండర్ బుక్ చేసినా డెలివరీ ఆలస్యం అవుతుండటంతో ఇన్‌స్టంట్ నూడుల్స్, ఉప్మా మిక్స్, రెడీమేడ్ పులిహోర వంటి వాటిపై ఆధారపడుతున్నారు. దీంతో రెడీ-టు-ఈట్ ఫుడ్స్, ఫ్రోజెన్ స్నాక్స్ సేల్స్ 20% పెరిగాయి. సూపర్ మార్కెట్లలో కొన్ని రోజులుగా ఇన్‌స్టంట్ ఫుడ్ సెక్షన్లలో స్టాక్ వేగంగా ఖాళీ అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News April 7, 2026

ఇంటర్.. ప్రత్యేకంగా అదనపు సబ్జెక్ట్ ఫలితాలు?

image

AP: ఇంటర్ విద్యలో సంస్కరణల్లో భాగంగా విద్యార్థులు 5 గ్రూప్ సబ్జెక్టులతోపాటు అదనంగా ఆరో సబ్జెక్టును ఎంపిక చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సబ్జెక్టు ఫలితాలను ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో పెట్టడం లేదా కాలేజీలకు పంపాలని అధికారులు యోచిస్తున్నారు. రెగ్యులర్ సబ్జెక్టుల రిజల్ట్స్ ఈ నెల 15-20 మధ్య రిలీజ్ చేసే <<19571013>>అవకాశం ఉంది<<>>.

News April 7, 2026

మాజీ మిస్ ఇండియా ఎర్త్ కిడ్నాప్?

image

మాజీ మిస్ ఇండియా ఎర్త్ (2019) విజేత సాయలీ సుర్వే తన నలుగురు పిల్లలతో కలిసి అదృశ్యం కావడం మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఆమె ఇస్లాం నుంచి తిరిగి హిందూ మతంలోకి మారిన విషయం తెలిసిందే. తన భర్త, అత్తమామలే ఆమెను కిడ్నాప్ చేశారని సాయలీ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. గతంలో ఆమె తన భర్తపై ‘లవ్ జిహాద్’, వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

News April 7, 2026

రూ.లక్ష కోట్లు గోదావరిలో పారబోశారు.. KTRపై మురళి ఫైర్

image

TG: కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు నీరందుతోందని కేటీఆర్ అమెరికా బిజినెస్ స్కూల్లో చేసిన కామెంట్లపై మాజీ IAS ఆకునూరి మురళి ఫైరయ్యారు. ’86వేల ఎకరాలకే సాగునీరు ఇచ్చామని 2023లో వీళ్ల బంధువు అయిన ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధరే చెప్పారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి పనికి రాకుండా పోయింది. రూ.లక్ష కోట్లు గోదావరిలో పారబోశారు. రిపేర్ చేసినా రూ.25వేల పంటకు రూ.లక్ష ఖర్చు పెట్టాలి’ అని ట్వీట్ చేశారు.