News May 6, 2024
HYD: రాష్ట్రంలో ఆ నాలుగు ఇక్కడే..!
TGలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలు రాజధాని పరిధిలోనే ఉండడం గమనార్హం. 37,80,453 మంది ఓటర్లతో మల్కాజిగిరి ఫస్ట్ ఉండగా 29,39,057మంది ఓటర్లతో చేవెళ్ల సెకెండ్ ప్లేస్‌లో ఉంది. ఇక 22,17,305మంది ఓటర్లతో HYD థర్డ్, 21,20,550 మంది ఓటర్లతో సికింద్రాబాద్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాయి. కాగా రాష్ట్రమంతా మహిళా ఓటర్లు ఎక్కువుంటే ఈ నాలుగింటిలో మాత్రం పురుషులు ఎక్కువున్నారు.
Similar News
News January 16, 2025
శంకర్పల్లి: మరకత శివాలయానికి హంపి పీఠాధిపతి
శంకర్పల్లి మండలం చందిప్పలోని 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి ఫిబ్రవరి 5న హంపి పీఠాధిపతి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామి రానున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
News January 16, 2025
నార్సింగి జంట హత్యల్లో మరో ట్విస్ట్
పుప్పాలగూడలో <<15160567>>జంటహత్యలు<<>> నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. క్రైమ్ స్పాట్లో వారి ఒంటిపై కత్తిపోట్లు, ముఖంపై రాయితో కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 11న మర్డర్లు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బిందుతో సాకేత్ వ్యభిచారం చేపించినట్లు తెలిసింది. ఆమెతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి వీరిని హత్య చేసి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు ఉన్నట్లు సమాచారం.
News January 16, 2025
రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా
రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. చందనవెల్లి 14.3℃, రెడ్డిపల్లె 14.7, తాళ్లపల్లి 15, కాసులాబాద్ 15.2, కేతిరెడ్డిపల్లి, షాబాద్, ధర్మసాగర్ 15.5, కందువాడ 15.7, మొగలిగిద్ద 15.9, ఎలిమినేడు 16.1, తొమ్మిదిరేకుల, వెల్జాల, షాద్‌నగర్ 16.3, రాచలూరు 16.4, ప్రొద్దుటూరు, అమీర్‌పేట్, మంగళ్‌పల్లి 16.6, రాజేంద్రనగర్ 16.7, నందిగామ 16.8, సంగం, మొయినాబాద్ 16.9, శంకర్పల్లి 17, HCUలో 17.1గా నమోదైంది.