News March 18, 2026

పెద్దపల్లి జిల్లాలో వరి సాగుకు సమృద్ధిగా నీరు

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వరి సాగుకు రైతన్నలకు యాసంగి పంటకు నీటి కొరత లేకుండా ఉంది. గతేడాది కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండడంతోపాటు SRSP నీరు విడుదల చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 2.80 లక్షల ఎకరాల్లో రైతన్నలు వరి సాగు చేశారు. కాగా ఇందుకు సంబంధించి 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News April 10, 2026

తగ్గిన గోల్డ్ రేట్స్

image

బంగారం ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ <<19612964>>ఉదయం<<>> పెరిగిన రేట్లు తాజాగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్‌ రూ.650 తగ్గి రూ.1,52,350కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 దిగివచ్చి రూ.1,39,650గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.2,65,000గా కొనసాగుతోంది.

News April 10, 2026

చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించండి: కలెక్టర్

image

కర్నూలు నగర శివారులోని గార్గేయపురం డంపింగ్ యార్డ్‌ను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సందర్శించారు. నగర కమిషనర్ విశ్వనాథ్, ఆర్డీవోతో కలిసి చెత్తను శాస్త్రీయ విధానంలో డీకంపోజ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. యార్డ్‌లో అమలవుతున్న నిర్వహణ పద్ధతులను అధికారులతో సమీక్షించారు. మరింత మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు. చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు.

News April 10, 2026

12న కోనసీమ జిల్లాలో మంత్రి రామ్ నారాయణ రెడ్డి పర్యటన

image

ఈ నెల 12న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. 11 గంటలకు వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో శ్రీనివాస భవనానికి శంకుస్థాపన చేస్తారన్నారు. మందపల్లి దేవాలయాన్ని సందర్శిస్తారని, అక్కడ తిలబక్షక మండపానికి భూమి పూజ చేస్తారన్నారు. కుండలేశ్వరంలో కార్యక్రమాల్లో పాల్గొని, మురమళ్ల వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు హాజరవుతారన్నారు.