News March 18, 2026

JN: వల్మీడి బ్రహ్మోత్సవాలు.. సమన్వయంగా పనిచేయాలి: కలెక్టర్

image

పాలకుర్తి మండలం వల్మిడిలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సమీక్ష నిర్వహించారు. డీసీపీ, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టరేట్‌లో చర్చించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

Similar News

News April 10, 2026

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు WARNING

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వేసవి తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ జిల్లాకు అలర్ట్‌ ప్రకటించింది. ఈ తేదీల్లో ఉష్ణోగ్రతలు 44°C దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12-4 గంటల వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

News April 10, 2026

కామారెడ్డి: ఈరోజు కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్తున్నారా..!

image

రామారెడ్డి-ఇసన్నపల్లి మధ్యలో కొలువైన <<18183120>>కాలభైరవస్వామి<<>> దేవాలయంలో శుక్రవారం బహుళ అష్టమి(భైరవాష్టమి) సందర్భంగా కాలభైరవాష్టకం పఠించనున్నారు. దీని వల్ల భయం, పీడకలలతో బాధపడేవారు మానసిక ధైర్యం పొందుతారని భక్తుల నమ్మకం. శోకం, మోహం, దైన్యం, కోపం వంటి మానసిక వ్యాధుల నుంచి విముక్తి లభించి ధ్యాన, ముక్తి మార్గాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. ఇది దక్షిణ భారతదేశంలో అతి పెద్ద కాలభైరవ స్వామి దేవాలయం. మీరు వెళుతున్నారా.!

News April 10, 2026

వరంగల్: ఏడుగురు MBBS విద్యార్థులపై కేసు

image

KMCలో ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు థర్డ్ ఇయర్ MBBS విద్యార్థులపై మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వారం కిందట జూనియర్లను వేధించిన ఉదంతంపై బాధితులు NMCకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. TG ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 కింద పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కళాశాల యాజమాన్యం ఏడుగురు సీనియర్ విద్యార్థులను 6 నెలల పాటు అకడమిక్ సెషన్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.